GNTR: డబ్బులు డిమాండ్ చేస్తూ తెనాలికి చెందిన టింబర్ డిపో వ్యాపారి, వైసీపీ కౌన్సిలర్ ఇర్ఫాన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్‌ను తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న ఇర్ఫాన్‌ను అహ్మద్ కిడ్నాప్ చేసి దాడి చేయడంతో పాటు బెదిరించడంపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.