AP: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సా.5 గంటలకు DY. CM పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ కానున్నారు. బడ్జెట్‌పై అవగాహన, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు.