W.G: మోటార్ సైకిల్ దొంగతనానికి పాల్పడుతున్న మత్స్యపురికి చెందిన కారేపల్లి ఏసురత్నం అరెస్ట్ చేసి, పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం అజ్మీ తెలిపారు. శనివారం ఆచంట పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ డిఎస్పీ జి. వేద పలువురు కదలికలపై నిఘా పెట్టారన్నారు. ఏసురత్నంను అదుపులోకి తీసుకోగా బైక్లు దొంగిలించినట్లు అంగీకరించాడన్నారు.