HYD: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు.