HYD: మూసాపేట్ ఆంజనేయ నగర్‌కు చెందిన సోమా ప్రభాకర్ 14 ఏళ్ల క్రితం తనకు దొరికిన కుక్క పిల్లను చేరదీసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తనకు ఆడపిల్లలు లేకపోవడంతో ఆ శునకానికి కుట్టి అని పేరు పెట్టి కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో కుక్కపిల్ల సోమవారం మృతి చెందింది. దీంతో వారు శోకసంద్రంలో మునిగారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.