KMR: రాజంపేట మండల కేంద్రంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బల్వంత్ రావు, మాజీ సొసైటీ చైర్మన్ అశోక్, మాజీ రైతు బందు అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎస్టీ సెల్ గణేష్ నాయక్, మండల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.