CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల కొలువైయున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం శివరూపిణి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత వెండి ఆభరణాలతో పాటు వివిధ పుష్పాలతో శివరూపిణి అలంకారంలో తీర్చిదిద్దారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.