W.G: తణుకు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో కోడి మాంసం అమ్మకాలు లేకుండా దుకాణాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్లో చేపలకు, రొయ్యలకు, మటన్‌కు భారీ డిమాండ్ పెరిగింది. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు ఆయా దుకాణాల వద్ద క్యూలు కడుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని దుకాణ యజమానులు ధరలు పెంచేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు