GNTR: బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. కేజీ చికెన్ రూ. 140, రూ.160ల బోర్డులు పెట్టినా కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. ఇదే అదునుగా చేపలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చేపల మార్కెట్, మిర్చియార్డు, ఆర్టీవో ఆఫీస్ రోడ్, పొన్నూరు రోడ్డు, అమరావతి రోడ్డు ప్రాంతాల్లోని ఆదివారం మాత్రమే దుకాణాలు కళకళలాడుతుంది.