కృష్ణా: మచిలీపట్నంలోని 10వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కోస్తా మురళీ సతీమణి పేర్ల వరలక్ష్మి హఠాన్మరణం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వరలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న ఆయన హుటాహుటిన విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చారు. వరలక్ష్మి భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. అనంతరం వరలక్ష్మి పాడె మోసి దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.