CTR: పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధిపై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్ఘాటించారు.