అన్నమయ్య: సీటీఎంలో జరుగుతున్న నల వీర గంగాభవాని జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మదనపల్లె రెండవ డిపో మేనేజర్ అమర్నాథ్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో 15 బస్సులు, ఆదివారం 5 బస్సులు నడుపుతున్నట్లు వివరాలు వెల్లడించారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.