కృష్ణా: ముసునూరు మండలం లోపూడిలో శుక్రవారం అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏవైనా మరమ్మత్తులు ఉంటే ముందుగానే విద్యుత్ కోత ప్రకటిస్తే అనుగుణంగా ముందుకు వెళతామంటూ ప్రజలు పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యాపారాలకు విద్యుత్ కోత తీవ్ర అంతరాయం కలిగిందన్నారు.