ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ హైస్కూల్ వద్ద శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. హిందూ దేవుళ్లను కించపరుస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం బోధనలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు అన్యమత బోధన చేస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు.