PLD: సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ తులసి సాంబశివరావు, వైస్ ఛైర్మన్ కోటేశ్వర నాయక్ పాల్గొన్నారు.