NLR: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఏఎన్ఎం నూర్జహాన్ తెలిపారు. సోమవారం ఉదయగిరి బీసీ కాలనీలోని తెలుగు ఉర్దూ పాఠశాలలో విద్యార్థులు అసెంబ్లీ జరిగే సమయంలో ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మధ్యాహ్నం భోజనం తర్వాత ఆల్బెండజోల్ టాబ్లెట్స్ తీసుకోవాలని సూచించారు.