NLR: అనంతసాగరం మండలం చిలకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించారు. హెచ్ఎం సురేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులలో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.