NLR: రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యంలో అనంతసాగరం డిప్యూటీ తహసీల్దార్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జిల్లాలో వరి కోతలు మార్చి నుంచి ముమ్మరంగా కొనసాగుతాయని, వెంటనే వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరారు.