KRNL: మంత్రాలయం మండలంలోని రచ్చుమర్రికి చెందిన 42 ఏళ్ల రైతు బోయ కపటి నరసింహులు ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. గ్రామంలో బంగారమ్మ దేవర మహోత్సవాల ఏర్పాట్లలో పాల్గొంటున్న నరసింహులు ఇంటి వద్ద శుభ్రం చేసే పనిలో ఉండగా, వైరు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు.