KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామ శివారులో ఆదివారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బోయ ఓబులమ్మను ఎస్సై మల్లికార్జున అరెస్టు చేశారు. ఈమె వద్ద నుంచి 180 ఎంఎల్ పరిమాణంలో 20 మ్యాన్సన్ హౌస్, 25 బ్రాందీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.