VZM: మూడు రోజుల నుండి నాణ్యమైన భోజనం పంపిణీ చేయకపోవడంతో సాలూరు బిసి బాలుర కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. జావ లాంటి అన్నం పెడుతుండడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యాన విద్యార్ధులు నాణ్యమైన భోజనం పెట్టాలని ధర్నా చేశారు. భోజనం అందించకపోవడం దారుణమని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలి అని ఎస్ఎఫ్ఎస్ఐ నాయకులు రాజు అన్నారు.