NDL: అవుకు మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నంద్యాల కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశాల మేరకు ఈనెల 10న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కార్యాలయ అధికారులు తెలిపారు. మండల పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.