NZB: వర్ని మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం పొలంలో పని చేస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ శుక్రవారం తెలిపారు. పోలీస్ల వివరాల ప్రకారం మృతుడు అదే గ్రామానికి చెందిన మేక వెంకటేశ్వర్ రావు వద్ద 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.