NRML: జిల్లాలోని 19 మండలాలలో ఎంపికైన 256 మందికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల సబ్సిడీని వెంటనే మంజూరు చేయాలని సీపీఎమ్ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ ద్వారా ఎంపిక చేసిన 2020-21 సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రుణాలను ఇప్పటివరకు మంజూరు చేయలేదని వాపోయారు