ASR: పాడేరు ఐటీడీఏ పీవోగా వీ.అభిషేక్ అందించిన సేవలు మరువలేనివని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కొనియాడారు. బదిలీపై వెళుతున్న పీవోకు శుక్రవారం పాడేరులో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో రహదారి నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు పీవో వీ.అభిషేక్ కృషి చేశారని తెలిపారు. ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు.