AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రుల ర్యాంకులపై CM చంద్రబాబు స్పందిస్తూ.. వేగవంతమైన, మెరుగైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దామన్నారు. ‘బృందంగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. పోటీపడి పనిచేసి పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే మంత్రులకు ర్యాంకులు. నేను కూడా నా స్థానం మెరుగుపరచుకోవాలి’ అని తెలిపారు.