MDK: హవేలిఘనపూర్ మండలం బ్యాతోల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.