NTR: ఐర్లాండ్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన యువకుడు, అతని మిత్రుడు శుక్రవారం రాత్రి మృతిచెందారు. గండ్రాయి గ్రామానికి చెందిన భార్గవ్ ఐర్లాండ్ దేశంలో చదువుకుంటూ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కారులో వెళుతుండగా మంచు కురవటంతో కారు చెట్టును ఢీకొని ప్రమాదానికి గురైంది. తన మిత్రుడు అక్కడికక్కడే మరణించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.