VSP: కసింకోటలో ఈనెల 3వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు పి.సూర్యనారాయణ, కార్యదర్శి గోపి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని ఓ ఫౌండేషన్ కంటి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.