VZM: చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలోని పల్లెల్ని శుక్రవారం మంచు దుప్పటి కప్పేసింది. అర్ధ రాత్రి నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు విపరీతమైన మంచు కురవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. విజిబిలిటీ 70 మీటర్లు ఉండటంతో వాహనాదారులు తమ వాహనాలను నెమ్మదిగా నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.