KNR: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ షెడ్యూల్ వెలువడినందున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మార్చి 8వ తేదీ వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. కలెక్టర్ ఎన్నికల నియామవళిపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రజలను ప్రభావితం చేసేలా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై రాతలు, చిత్రపటాలు తొలగించాలని హెచ్చరించారు.