ASF: కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటం లేదు. దీంతో కాజీపేట్-బల్లార్షా సెక్షన్ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సేవలు ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ప్రయాణికు ఇబ్బందులు పడుతున్నారు.