ASF: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని గోడవెల్లి మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, సరుకుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. నాణ్యమైన విద్య బోధన అందించాలని అన్నారు.