»Rahul Ji Take Our Bangla Mallikarjun Kharge And Revanth
Rahul ji మా బంగ్లా తీసుకోండి.. యువనేతను కోరిన ఖర్గే, రేవంత్ రెడ్డి
Rahul ji take our bangla:రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడగా.. బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ ప్యానల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు బాసటగా కాంగ్రెస్ ముఖ్య నేతలు నిలుస్తున్నారు. తమ బంగళా ఇస్తామని ముందుకు వస్తున్నారు. వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (kharge), టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఉన్నారు.
Rahul ji take our bangla: mallikarjun kharge and revanth
Rahul ji take our bangla:రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడగా.. బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ ప్యానల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు నెలరోజుల సమయం ఇచ్చారు. రాహుల్‌ను (Rahul) టార్గెట్ చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయనకు బాసటగా కాంగ్రెస్ ముఖ్య నేతలు నిలుస్తున్నారు. తమ బంగళా ఇస్తామని ముందుకు వస్తున్నారు. వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (kharge), టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఉన్నారు.
రాహుల్ గాంధీ (Rahul gandhi) తల్లి సోనియా గాంధీ (Soniya Gandhi) ఇంటికి వెళతారు. లేదంటే తన బంగ్లా ఇస్తా కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పేర్కొన్నారు. ప్రతి పక్ష సభ్యులను అవమానించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్నదని ఖర్గే మండిపడ్డారు. ఇదే అంశంపై టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా రియాక్ట్ అయ్యారు. అవసరమైతే తన బంగ్లాను పార్టీ నేత కోసం ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించారు. మేరా ఘర్ ఆప్ కా ఘర్ అంటూ రాహుల్‌ను (rahul) ఉద్దేశించి ఒక పోస్టు పెట్టారు రేవంత్. ‘రాహుల్ భయ్యా.. మేరా ఘర్ ఆప్కా ఘర్. నా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనమంతా ఒక కుటుంబం. ఇది నీ ఇల్లు కూడా’ అని రేవంత్ పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న 30 రోజుల్లో రాహుల్ గాంధీ (Rahul gandhi) బంగ్లా ఖాళీ చేయాల్సి ఉంటుంది. గడువు పొడిగించాలని రాహుల్ (rahul) విజ్ఞప్తి చేసుకుంటే ప్యానల్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని ఒక అధికారి చెప్పారు. తగ్గేదే లే అంటున్న రాహుల్ (rahul).. కోర్టుకే క్షమాపణ చెప్పలేదు. ప్యానల్‌ను గడువు పొడిగించాలని కోరే అవకాశం లేదు. నిర్దేశించిన సమయంలోనే బంగ్లా ఖాళీ చేస్తానని లేఖ రాశారు.
ఇటు కోలార్ ఎన్నికల సభలో మోడీ ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలేనని రాహుల్ గాంధీ (Rahul gandhi) కామెంట్ చేశారు. ఈ కేసు సూరత్ కోర్టులో విచారణ జరిగి.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇవ్వడంతోపాటు.. శిక్షను నిలుపుదల చేసింది. ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకన్నా ఎక్కువ జైలుశిక్ష పడితే పదవీలో కొనసాగేందుకు అవకాశం లేదు. దీంతో లోక్ సభ సెక్రటరీ జనరల్ రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత బంగ్లా ఖాళీ చేయాలని కూడా నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సహా విపక్షాలు.. రాహుల్ (Rahul gandhi) అనర్హత వేటు గురించి పోరాటం చేస్తున్నాయి. తనకు తాను రాహుల్ గాంధీ.. డిస్ క్వాలీఫై అని ట్విట్టర్ బయో మార్చుకున్నారు.