E.G: గోకవరం మండలం కొత్తపల్లి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఎంపీటీసీ ముదిలి భువనేశ్వరి(38) గుండెపోటుతో గురువారం మృతి చెందారు. ఈమె 2021లో గోకవరం మండల ప్రజా పరిషత్ ఎంపీటీసీ సభ్యురాలిగా వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. ఆమె మృతి పట్ల గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, జడ్పీటీసీ సభ్యులు దాసరి శ్రీరంగ రమేశ్, తోటి ఎంపీటీసీ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.