KMM: తల్లాడ మండల పరిధిలోని పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన మువ్వ పుల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్, పోట్రు శ్రీనివాసరావు, మోత్కూరి శ్రీనివాసరావు, గుండ్ల వెంకటేశ్వర్లు, మువ్వా రోశయ్య పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.