NZB: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా స్పష్టం చేశారు. నేడు ధర్మారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాత్రివేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహణపై ప్రిన్సిపల్‌తో మాట్లాడారు.