MBNR: మహబూబ్నగర్ ఎంపీ కార్యాలయంలో నూతనంగా జడ్చర్ల పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎడ్ల అమర్నాథ్ గౌడ్ గురువారం ఎంపీ డీకే అరుణను కలిసి సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారికి ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.