నిర్మల్: నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మెడికల్ యాజమానులు మందులు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పె క్టర్ శ్యాంసుందర్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలలో తనిఖీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ డ్రగ్స్, కాస్మోటిక్ 1945చట్టం ప్రకారం నిబంధనలు పాటించని మెడికల్ దుకాణాలు, ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీచేశామని అన్నారు.