NRPT: మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలను ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభించారు. అనంతరం గోదాంలను పరిశీలించారు. రైతుల పంటలు నిల్వ చేసుకునేందుకు గోదాంలు ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.