కడప: మంత్రి నారా లోకేష్ కొప్పర్తి అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి పేర్కొన్నారు. గురువారం కమలాపురంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఆయన మాట్లాడారు. ముందుగా కేక్‌ను కట్ చేసి లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కమలాపురం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న లోకేష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.