VZM: ఎస్.కోట మండలం తిమిడి గంగిరెడ్ల కాలనీలో వీధి కుళాయిలను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు గురువారం ప్రారంభించారు. కాలనీ వాసులకు రక్షిత మంచినీరు అందించేందుకు ఎంపీపీ నిధులతో కాలనీలో కుళాయిలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ఎంపీపీ సండి సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, ఎస్.కోట సర్పంచ్ సంతోషి కుమారి పాల్గొన్నారు.