ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గం వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గోగుల కైలాశ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కైలాశ్ మాట్లాడుతూ.. తనకు అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.