NLR: దుత్తలూరు మండలం ఏరుకొల్లు సచివాలయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా లెక్క చేయకుండా విధులకు ప్రతిరోజూ ఆలస్యంగానే వస్తున్నారన్నారు. సమస్యలను లెక్కచేయకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల మీద చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.