SKLM: సమస్యల పరిష్కారం కోసమే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించామని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగా గ్రామాల్లో సమస్యలు పేరుకు పోయాయన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రజా గ్రీవెన్స్ నిర్వహించమన్నారు.