శ్రీకాకుళం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన సిరిపురపు తేజేశ్వరరావు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును బుధవారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్నికకు సహకరించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కూటమి బలోపేతానికి కృషిచేయాలని ఎమ్మెల్యే అన్నారు.