NLR: ద్విచక్ర వాహనాలను మైనర్లు నడపరాదని ఆత్మకూరు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు తెలిపారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని, వెనుక ఉండే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదన్నారు.