TG: గ్రామసభలు సజావుగా సాగుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. కొన్ని చోట్ల కావాలనే గొడవలు సృష్టించారని అన్నారు. అధికారుల సమన్వయలోపం వల్లే గందరగోళం జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. సర్పంచ్ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని, వీలైనంత త్వరగా సర్పంచ్ ఎన్నికలు జరిగితే బాగుంటుందని వెల్లడించారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని తెలిపారు.