కృష్ణా: పెనమలూరు మండలంలో రేపు ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పశు వైద్య అధికారులు మంగళవారం తెలిపారు. మండలంలోని నెప్పల్లి, గోడవర్రు, కానూరు, చోడవరం గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరం జరుగుతుందని చెప్పారు. పశువులకు సంబంధించిన గర్భకోశ వ్యాధులు, చూడి పరీక్షలు, గొర్రెలు, మేకలు టీకాలు, వాటికి ఏమైనా వ్యాధులు ఉంటే సంబంధించిన మందులు పంపిణీ చేస్తారని తెలిపారు.