SKLM: గుంటూరులోని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్‌ను మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు వడ్డాది శ్రీనివాసరావు, తాళాబత్తుల పైడిరాజులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు.